Friday, July 31, 2009

నాకు తెలీదమ్మా...

"నాకు తెలీదమ్మా...", "ఇదేం చొద్యమొగానీ.."
ఆహా.. నా తెలుగెంత తీయనిది?!!!..
ఎంత చదువులు చదివి.. ఎన్ని దేశాలు తిరిగిన తెలుగింటి అడబడచైన,
మరో మహిళా మణిని కలవ గానే
ఎందుకో తెలియదు గాని చర్చ మాత్రం పొరిగింటి గూర్చే సుమా.
"ఏమిటో నమ్మా. నాకు తెలియదు గానీ.. ... ........ చూసేవా...
తో ప్రారంభ మైన చర్చ వారి, వారి ఆర్ధిక, సామాజిక, గృహ, .... అలా చెప్పుకుంటూ పొతే..
అనంత మిన్ని విషయ సృంఖలాలు సాగిపోతుఉంటై ..."
దీనికి మన మనస్తత్వ వేత్తలు ఎలా భావిస్తారో తెలియదు గాని..
నా కైతే మాత్రం.. ఇలాంటి వాళ్ళందరిని పిలిచి, ఒక చోట చేర్చి.. క్లాస్ పీకాలని ఉంది.."
అయ్యో, అయ్యో, క్షమించాలి.. పొరపాటున జాడ్యం మహిళల దే అనిఅన్నట్లున్నాను.
మనస్పూర్తిగా నన్ను క్షమించెయ్యండి తల్లులార.. ఇది మీ ఒక్కరి జాడ్యం మాత్రమే కాదు..
మా "మగ పున్గావులది కూడా". ఒక చోఇత చేరిన తర్వాత వారికీ ఎంత సేపైనా ఇంకొకరిగూర్చి
చర్చించడం లోని ఆనందం మరో విషయ సముపార్జన లో గాని ఇంకేండులో నైన మరి ఉండదు..
ఏంటో మరి "అయినా నాకెందుకు లెమ్మ..."

Wednesday, July 29, 2009

సత్కారాలు .. చిత్కారలా..

మద్యన మా స్నేహితునికి బదిలీ అయ్యింది.. అక్కడ తనతో పనిచేసిన మిత్రుని నే కలవడం జరిగింది. మా స్నేహితునిసహోద్యోగులందరూ కలసి మా స్నేహితుని సన్మానం చేసారని తెలిసింది.. వివరాలలో కి వెళితే...
మొన్న పద్దేమ్దో తారికున బదిలీ కాగితం తో వెళ్ళిన మా స్నేహితునికి తన సహోద్యోగులందరూ కలసి " రోజు మీకుసత్కారం చేస్తాం.. అది ఎలా చెయ్యాలని మీరు భావిస్తున్నారని సనమన గ్రహితని అడిగేరుట".. ప్రశ్న కి ప్రబుద్దుడు"నాకు కనీసం ఒక గజ మాలా, ఫలం, పత్రం, పుష్పం, తోయం తమ చిత్తం అన్నారుట.." అందుకు వారు బహు సంతసించి, అందుకు అయ్యే ఖర్చు వేచ్చల్లోంచి కొంత తమరు భరిస్తారా? అంటే సదరు స్నేహితులు గారు దానికేం భాగ్యం అన్నారుట.."
అందుకు గాను వారందు చందాలేసుకుని (అందులో కొంత మిగుల్చుకుని) దుస్సాలువ కప్పి సంమనిన్చేరుట..
బాగుందా?.
.. ఎందఱో మహానుభావులు అందరికి వందనం

Tuesday, July 28, 2009

ఏమి ఈ రీతి??

"సజాతి ధృవాలు వికర్శించుకుంటాయి ..
..విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి ..."
మా చిన్నప్పుడు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు బోదించిన శాస్త్రం..
నాకెందుకో నియమాలన్నీ పుస్తకాలకేనేమో అనిపిస్తుంది..
నాడు సమాజం లో ఏర్పడే గుంపులన్నీ పై సూత్రానికి విభేదించేవే..
ధనిక వర్గ మంతా ఒకటిగా ఉంటుంది..
పేదవర్గ మంతా ఒకటిగా ఉంటుంది..
రెండు వర్గాలకి చెందని అధికసంఖ్యాక వర్గం ఒంటిగా ఉంటోంది..
పాపం దాంతో చేరడానికి వర్గము ఆసక్తి చూపదు.. ఎందుకో నాకు తెలియదు..
మరో చిత్రం చూసేరా ... వర్గం లో మాత్రం "సజాతి ధృవాలు వికర్శించుకుంటాయి."
ఇదేమీ.. రీతి గురుడా...?

Monday, July 27, 2009

చిత్రాలు

"చిత్రాలు చూడరో గురుడో.. గురుడా."
అని ఆమధ్య సిని కవి అన్నట్టు గురుతు.
రోజూ ఎన్నో చిత్రాలు. ఇలా నాకేనా ?
ప్రకృతీ అంతా చిత్రాలమయం....
ధనావేసం చుట్టూ రుణావేశం..
ధనం చుట్టూ ఋణం..
స్త్రీ చుట్టూ పురుషుడు..
ఆనందం తోటే విషాదం...
వెలుగు వెంటే చీకటి...
జననం వెంటే మరణం...
ఏంటో చిత్రం..
నీవెంటే నేను...
నా వెంట నీవు లేవెందుకో...
నే
ఎంత ఆలోచించినా ...


Sunday, July 26, 2009

స్వగతం

ఇవన్ని నా స్వగతాలె. ఇందులో నా బాధలన్ని నా చదువరుల కోసమే. బుర్రనిండా ఆలోచనలు. ఎక్కడెక్కడికో అవి తీసుకుని పోతున్నై. వాటినన్నింటిని తీసుకుని రావాలని ఉంది. అవన్నీ పంచుకోవడం అంటు జరిగితే అది మీతోనే.
నిన్న మా స్కూల్లో ఉన్నా చెట్టు కింద నే కూర్చుని ఉన్నపుడు నా విద్యార్ధి వచ్చి "సార్ . రామ రాజ్యం గొప్పదా? రావణ రాజ్యం గొప్పదా? " అని సింపుల్ గా అనేసాడు.
అప్పుడు వాడికి ఏదో జవాబు చెప్పినా నాకు మాత్రం బుర్ర పనిచెయ్యలేదు. వీడు తెలిసే అడిగేడా లేక పొతే తెలియక అడిగేడా? అసలు దీనికి జవాబు ఎలా చెప్తే బాగుంటుంది? అలా అలోచించి సదిగ్ధం లో ఉండిపోయాను.
ఒకరోజు వేదిక మీదనుంచ్ మా తెలుగు సార్ "రాముడు అంత గొప్ప నాయకుడు లేదు.. చిన్న మాట కోసం భార్యనే అడవులకి పంపించిసేడు తెలుసా" అన్నారు . నాకనిపించింది. అంత గొప్ప ఏముంది.. ఈనాటి మన నాయకులూ తలుచుకుంటే ఎవ్వరినైనా అడవికి కాకుండా.. యమపురికే పంపగలరు. నేటి రీతినుంచే ఆలోచన జనించాలి..
అంతే కానీ రామరాజ్యం ఎక్కడుంది? ఈమద్య కాలంలో సత్యమేవ జయతే అంటూనే దర్జాగా అబద్దాలడేస్తున్నారు.
ఇంకెక్కడి సత్యమేవ జయతే?.. నాకెందుకో... "సత్యమేవజయతే" ని "లంచమేవ జయతే".. అంటే బాగుంటుంది కదా.. అనిపిస్తోంది.. మరి మీకో?