Sunday, July 26, 2009

స్వగతం

ఇవన్ని నా స్వగతాలె. ఇందులో నా బాధలన్ని నా చదువరుల కోసమే. బుర్రనిండా ఆలోచనలు. ఎక్కడెక్కడికో అవి తీసుకుని పోతున్నై. వాటినన్నింటిని తీసుకుని రావాలని ఉంది. అవన్నీ పంచుకోవడం అంటు జరిగితే అది మీతోనే.
నిన్న మా స్కూల్లో ఉన్నా చెట్టు కింద నే కూర్చుని ఉన్నపుడు నా విద్యార్ధి వచ్చి "సార్ . రామ రాజ్యం గొప్పదా? రావణ రాజ్యం గొప్పదా? " అని సింపుల్ గా అనేసాడు.
అప్పుడు వాడికి ఏదో జవాబు చెప్పినా నాకు మాత్రం బుర్ర పనిచెయ్యలేదు. వీడు తెలిసే అడిగేడా లేక పొతే తెలియక అడిగేడా? అసలు దీనికి జవాబు ఎలా చెప్తే బాగుంటుంది? అలా అలోచించి సదిగ్ధం లో ఉండిపోయాను.
ఒకరోజు వేదిక మీదనుంచ్ మా తెలుగు సార్ "రాముడు అంత గొప్ప నాయకుడు లేదు.. చిన్న మాట కోసం భార్యనే అడవులకి పంపించిసేడు తెలుసా" అన్నారు . నాకనిపించింది. అంత గొప్ప ఏముంది.. ఈనాటి మన నాయకులూ తలుచుకుంటే ఎవ్వరినైనా అడవికి కాకుండా.. యమపురికే పంపగలరు. నేటి రీతినుంచే ఆలోచన జనించాలి..
అంతే కానీ రామరాజ్యం ఎక్కడుంది? ఈమద్య కాలంలో సత్యమేవ జయతే అంటూనే దర్జాగా అబద్దాలడేస్తున్నారు.
ఇంకెక్కడి సత్యమేవ జయతే?.. నాకెందుకో... "సత్యమేవజయతే" ని "లంచమేవ జయతే".. అంటే బాగుంటుంది కదా.. అనిపిస్తోంది.. మరి మీకో?

No comments:

Post a Comment