Saturday, December 17, 2011

హలో బాగున్నారా....

నేనేనండీ...
ఈమధ్యన వీలు కుదరక.. మీకు బోరు కొట్టడం ఎందుకని తెలుగు బాగా రాయడం(కంప్యూటర్లో) నేర్చుకుని.. మళ్ళీ మీముందుకు రావాలని ఇన్నాళ్ళూ ఆగేను.. తప్పులు తగ్గితే మళ్ళీ ముందుకు త్వరలో రడీ... బోలెడు విషయాలు మనకోసం రడీ..
మీ.

Monday, August 17, 2009

ఇదీ నా తున్తర్వ్యూ

T.V. లోనూ పత్రికలలోనూ మధ్య వస్తున్నా ఇంటర్వ్యూ లు చూసి ప్రేరణ పొందిన వాడినయి..
నన్నెవరూ ఇంటర్వ్యూ చెయ్యలేదని ఉడుకుపీత్తనం తో నన్ను నేనే ఇంటర్యూ చేసుకుమ్తున్నాను.
మీ పేరు.... మా అమ్మ నాన్న పెట్టిందే..
మీ వూరు.. నేనున్దేదే.
మీ విద్యాభ్యాసం... కూడు పెట్టేంత..
మీకిష్టమయిన రంగు.. రంగు పడనిది...
మీ కిష్టమయిన రుచి.. నాలిక మండనిది.
మీ కిష్టమయిన కవి ... .వి. (కనపడదు..వినపడదు)
మీ కిష్టమయిన పుస్తకం ... ఎక్కాల పుస్తకం..
మీ కిష్టమయిన నాయకుడు.. నేనుకాదు
మీ కిష్టమయిన వ్యక్తీ.. చెప్పెకడా నేనుకాదు..
మీకిష్టమయిన పాట.. వేలాం పాట.
మీ లో మీకు నచ్చినది.. నా తిక్క.
మీ లో మీ నచ్చనిది.. బాబూ.. చెప్పినవే చెప్పడం మా ఇంటా వంటాలేదు.. నాతలతిక్క.
..... ఎలాగుందండి నా తున్తర్వ్య్....నా గురించి నే చెప్పడం బాగోదేమో.

Sunday, August 16, 2009

జయహో భారతమా

భారతమా ప్రియ భారతమా ..బంగారువేలుగుల భవితవమా..
నీ ముంగిట పారిజాతాలూ.. నవశాంతి కాంతి ఆభరణాలు ..
హలో ....నేను పాట పాడడమేంతా అనుకుంటున్నారా..
భయ పడకండి.. నీ పాడటం లేదు. గుర్తుకు తెస్తున్న నంతే.
ఒకానొక నాడు దూర్దర్సన్లో వచ్చిన ఒక సేరయాలకి టైటిల్ సాంగు ఇది.
౬౨ వసంతాలు మింగి ౬౩ సంవత్సరాలు వయస్సోచ్చినా కూడా..
ఇంకా బాలాకుమారిలా ... మనం అందరమూ భవితవం గురించే తలపోయడం చిత్రం....
ఎంత అభివృద్ది, మరెంతో ఘన విజయాలను సొంతం చేసుకుని .. ముందుకు సాగుతున్న మన భారతం...
చాలా ........ ముందుకు వెళిపోయింది. ఎంత ముందుకు అంటే... భారతానికి అర్ధరాత్రి ( అంటే అమెరికా దగ్గరకి)
దాకా వెళ్ళిపోయింది.. చూసారా ఎంత ముందడుగో..
సాధించిన ఘన విజయాలన్నీ ( మనం) అమెరికా కి ఇచ్చేసి భారతం ముందుకు వెళిపోతోంది....
ఇక్కడా మనకి (భారతీయులుకి) సాధించడానికి వనరులుండవు, ప్రోత్సాహం ఉండదుటా...
కొత్త జాగాలో ( అమెరికాకి వేల్లిపోయేం కదా అక్కడ అన్నిలభిస్తాయత కదా..
నిరుద్యోగం భారతావనిలో అనంతం అన్నారొక మేధావి.
ఇక్కడ నిరుద్యోగం లేదు బాబూ.. చిరుద్యోగం ఉంది నాయన అని చెప్పాలని ఉంది..
నాడు నిరుపెదలంతా, చక్కని ఫలితాలనిచ్చే ఉద్యోగాన్ని సాధించేరు మీకు తెలుసా?
అదే నంది రాజకీయం . ప్రభుత్వాని కయితే అయిదు సంవత్సరాలే పాలించే హక్కు.
కాని సో called పేదలకు ప్రభుత్వమున్న పండగే..
ఉండడానికి ఇల్లు.., తినడానికి చవుక ధరలకే బియ్యం, ఇతర వసతులన్నీ పేదలకే సుమా..
అందుకే నాకు అప్పుడప్పు అనిపిస్తుంది భారతంలో పెదవాదిగానేనా పుట్టాలి లేదా అమ్బానిలగానేనా పుట్టాలి కానిమధ్య బతుకులు ........
ఏనాటికి కూడా భారతం లో మన భారతం పట్టేవే.. నాది తప్పంటారా??????

Thursday, August 13, 2009

డాడీ .. విలేజ్ అంటే ఏమిటి?

డాడీ .. విలేజ్ అంటే ఏమిటి?
నిజమే .. పాపా అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పగలనా!! ఈనాటి తండ్రులకు వచ్చేప్రస్నేనేమో???
"బూం అంటే తెలియని ఆరోజుల్లో హాయి గా గ్రామాలున్దేవి.. పచ్చని చీరకట్టిన నెల తల్లి..
పూల సుగంధం పూసుకుని చల్లని సహజమయిన గాలి,
గడప దగ్గరకేల్లినా ఆప్యాయమయిన పలకరింపులు..
ఇంటిదగ్గర చూసినా.. రంగవల్లులు.. అబ్బో.. సినిమాలలో తప్ప చూడని సీతారామయ్యగారి మనమరాళ్ళు..
ఎక్కడకి పోయాయండి???
బడా బాబుల ని చూసి, పులిని చూసి నక్క వతపెట్టుకున్న చందాన పల్లెల్లోకూడా,
పట్నపువాసనలోచ్చేసాయి..
ఉన్నా పొలాలని రియలెస్టేటు బడాబాబుల చేతులలో పెట్టి, నేలతల్లిని సాగు చేయక బీడుభూములుగా మార్చివేసారు..
వారి దయవలన మిగిలిన చిన్న చైనా రాయ్తులంతా వర్షాల్లేక, వ్యవసాయం చెయ్యలేకా ఉన్నా మిగిలిన కాస్త భూమినికూడా బీడు చేసేస్తున్నారు.. అదే మనపాలిట శాపమయి, వర్ష భావ పరిస్థితిని, కొనలేని ధరలనూ పంచుతున్నాయి.
పెద్దలారా. ఉన్నా ప్రజలందరికీ ఇల్లిద్దాం కానీ తిన్దిలేకపోతే ఇంలోకుర్చుని చావాలి కాని మరో దారిలేదు..
globalaization, industrialization, paniki ahaara padhakam పంటలుంటేనే, ఆంధ్రావని పచ్చగా ఉంటేనే అందంకాని పంటల్లేని, ఎండిపోయిన బీడు భూములకు, శోభించవు.. అయ్యా, అమ్మా, గ్రామానికి అర్ధం చెప్పేలా గ్రామాలనిమిగల్చరూ....

Sunday, August 9, 2009

మతం - అభిమతం

హలో .... మీరు మతం వారు? మీరేముట్లు?
ప్రశ్నలు మనం మద్య తరచూ గా వింటున్నాం.
నాకు ఎప్పుడూ ఒక అనుమానం.
అసలు మతమంటే?.... మన ఇష్టం అని కదా..
లోకంలో అందరి ఇష్టాలు ఒకతవాలని లేదుగా...
మరి గొదవలెన్దుకూ. ...
ఇష్టాలలో నా ఇష్టం గొప్పది.. నీ ఇష్టం తక్కువది అని ఏమి ఉండదుగా ..
మతంలో దేముడు అందరికంటే నేనే గొప్ప అని ప్రవచించేడు..
ఆయా దేవతలని ప్రచారం చేసే ప్రవక్తలే వారి గూర్చి లోకానికి తెలియ చేసారు గాని వారంతా వారుగా నేనే గొప్ప అనిఅనలేదుగా.
మనలో ఉన్నా అన్ని అవకరాలని మన దేవతలకీ కూడా అంతగాడుతున్నమేమో..
ఎవరు ఆలోచించాలి?? అతివాదులా?? మితవాదులా? ఏంటండీ గొడవ??
మనకెందుకు.. ఎవరిమతం వాళ్ళకి గొప్పా. అని అనుకుని దుప్పటి ముసుగేసేద్దమా..
లేక కొందరికేనా చెప్పడానికి " బాబూ అన్ని మతాలూ మన ఇష్టాలనుండే వచ్చేయి నాయనా..
ఇష్టాలగురించి కొట్టుకోకండి నాయనలారా..." అని ఎలుగెత్తి అరుద్దామా.... నాటో కొంచెం గొంతు కలపరూ. ...

Wednesday, August 5, 2009

అహో నా తెలుగు..

తెలుగు లోనే చదవాలనే తెలుగరీ..
నాపిచ్చి కానీ .. తెలుగు ఇష్టం ఎవరికో తెలుసా..
పరాయి దేశం లో ఉన్నా మన తెలుగోడికే.
"పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదన్నట్లు.. "
ఆంద్ర ప్రదేశ్ వాళ్ళకి తెలుగు సైట్లు కానీ, తెలుగు బ్లాగులు కాని చదవబుద్ది కాదేమో?
ఎందుకో మరి తెలియదాయె.. పొరుగు కూరే రుచిగా తలచె..
బెంగుళూరు కెళ్ళి తెలుగు బ్లాగు నడిపితే..చదువరులకి చాల బాగుంటుంది..
అదే తెలుగు దేశంలో ఉండి, నడిపే తెలుగు బ్లాగు కి తెగులు వచ్చునట..
నాకెందుకో ఒక చిన్న అనుమానం, వలని బతికిన చేపలు పట్టడానికి కాకుండా,
చచ్చిన చేపలు పట్టడానికేమోనని .(వలంటే నెట్ అన్నా మాట)
కొందరు తెలుగు దేశం లో ఉన్నా తెలుగు T.V. చానళ్ళ వాళ్ల కి తెలుగు సరిగా మాట్లాడ్డం రాని వాళ్ళే దొరుకు తారు.
దేశం మరి గొడ్డు పోయింది..
కనీసం తమ భావాలను తెలియచేసే వారు గానీ, చెప్పే వారు గాని సదరు తెలుగు గడ్డ మీద లేరేమో?
నా వరకూ. నే నాకొచ్చిన తెలుగుతో అందరిని ఇలాగే బాధిస్తుఉంటాను.
మేరె అలోచించి అవలోకించండి..

Tuesday, August 4, 2009

అమ్మో ఒకటో తారీకు!!!

మల్లీ వచ్చిందండి ఒకటో తారీకు..
అంబ టేరోచ్చిన్ దే అత్తగారూ.. అంటే కొలతెడ్డు ఉండే కోడలా అన్నట్లు.
ఒక నాడు 1100/- రూపాయలు వచ్చినప్పుడు అదే భయం,
ఈనాడు 11,000/- రూపాయలు వచ్చినప్పుడు అదే భయం.
అప్పుడు కండి పప్పు కిలో ౫.౦౦ రూపాయలు ఉంటే ఇప్పుదు ఏకంగా ౯౦ రూపాయలు అయిపొయింది..
ఆమద్యన ఓ సిని కవి " ఎం తినే టట్లు లేదు ఎం కోనేటట్లు లేదు" అని చాల బాగా పాట రాసి చూపించేరు.
ఏది కొనడానికి వెళ్ళినా జేబులు ఖాలీ అవ్వడమే తప్ప వస్తువులు ఏమి రావడం లేదు..
ఈ స్తితి మనకేనా! అదే లెండి మన మధ్య తరగతి వారికే నేమో!..
ఒక మిత్రుడు కలసి ఆమద్యన సెలవిచేరు " నా బ్లాగులకి నెలకి ఓ పది వేలు వస్తున్నాయి అని"
అదెలాగో నాకైతే సమజవలేదు.. ఏదో వేన్నీళ్ళకి చన్నిలు తోదవుతయను కుంటే.. ఉన్నా నీళ్లన్నీ వేడెక్కిపోతున్నాయి కాని చన్నీళ్ళు అవడంలేదు.
సరేలే మన బాధలు ఎలాగూ ఉన్నాయి.. ఇంకొకర్ని భాదిన్చదమెండుకనుకుంటే.. ఏమి తోచిచావడం లేదు. ఎందుకు లెండి ఈ గోల!! ఇక ఈ రోజుకి ఉంటాను...