Tuesday, August 4, 2009

అమ్మో ఒకటో తారీకు!!!

మల్లీ వచ్చిందండి ఒకటో తారీకు..
అంబ టేరోచ్చిన్ దే అత్తగారూ.. అంటే కొలతెడ్డు ఉండే కోడలా అన్నట్లు.
ఒక నాడు 1100/- రూపాయలు వచ్చినప్పుడు అదే భయం,
ఈనాడు 11,000/- రూపాయలు వచ్చినప్పుడు అదే భయం.
అప్పుడు కండి పప్పు కిలో ౫.౦౦ రూపాయలు ఉంటే ఇప్పుదు ఏకంగా ౯౦ రూపాయలు అయిపొయింది..
ఆమద్యన ఓ సిని కవి " ఎం తినే టట్లు లేదు ఎం కోనేటట్లు లేదు" అని చాల బాగా పాట రాసి చూపించేరు.
ఏది కొనడానికి వెళ్ళినా జేబులు ఖాలీ అవ్వడమే తప్ప వస్తువులు ఏమి రావడం లేదు..
ఈ స్తితి మనకేనా! అదే లెండి మన మధ్య తరగతి వారికే నేమో!..
ఒక మిత్రుడు కలసి ఆమద్యన సెలవిచేరు " నా బ్లాగులకి నెలకి ఓ పది వేలు వస్తున్నాయి అని"
అదెలాగో నాకైతే సమజవలేదు.. ఏదో వేన్నీళ్ళకి చన్నిలు తోదవుతయను కుంటే.. ఉన్నా నీళ్లన్నీ వేడెక్కిపోతున్నాయి కాని చన్నీళ్ళు అవడంలేదు.
సరేలే మన బాధలు ఎలాగూ ఉన్నాయి.. ఇంకొకర్ని భాదిన్చదమెండుకనుకుంటే.. ఏమి తోచిచావడం లేదు. ఎందుకు లెండి ఈ గోల!! ఇక ఈ రోజుకి ఉంటాను...

No comments:

Post a Comment