Sunday, August 2, 2009

ఏంటో అన్ని "దినాలే"

నా చిన్నతనం లో కొన్ని దినాలే ఉండేవి.. మరి ఇప్పుడో.. అన్ని "దినాలే"
నావరకూ ఈ నాడు మనం అందరం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఎవరినో చూసి,
ఈ దినాల సంప్రదాయాన్ని సొంతం చేసుకున్నట్లు అనిపిస్తోంది..
అన్ని "దినాలే"..
స్వతంత్ర దినం
రిపబ్లిక్ దినం
స్నేహితుల దినం
అమ్మల దినం
నాన్నల దినం
పర్యావరణ దినం
ప్రేమికుల దినం
అన్నల దినం
అక్కల దినం
తమ్ముళ్ళ దినం
ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని దినాలే.
వీటి లో పై రెండు తప్పిస్తే మిగిలిన దినాలు ఎందుకో మీకయినా తెలుసా?
పూర్వకాలం లో ఈ so called T.V. Channels ఇన్ని వార్త చానళ్ళు లేని రోజులు ఒక సారి గుర్తుకు తెచ్చు కుంటే.
ఇన్ని దినాలు మనకు కనపడవు.. మరి ఈ రోజు ప్రతీ చెత్త విషయానికి ప్రాధాన్యత ఇచ్చి తెగ బోరేస్తున్నాయి
ఆ దినం, ఈ దినం అని చిన్నపిల్లలని ప్రేరేపించి అడ్డమైన చేత్తవస్తువులని కొనిపించి ఆనందిస్తున్నాయి..
మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను పూర్తిగా మరచిపోయేలా చేస్తూ పైకి మత్రం తామే తమ భుజ స్కంధాల మీద ఆ భారాన్నంతా మోస్తున్నట్లు పోజిస్తున్నాయి.
మన అందరి మనసులకి తెలుసు.. ఈ స్నేహితుల దినం ఎన్తవరకూ. స్నేహితులకే పరిమితమో..
స్నేహం పేరుతొ ప్రేమ అనే ఉచ్చు లోకి చిట్టి బాల్యాన్ని బలవంతంగా{ ఆకర్షణ} నలిపేస్తున్న నేటి ఈ సంస్న్స్క్రుతి ని ఏమని స్వాగాతిద్దామంటారు ?..
పాఠశాల లో చదివి చిన్నారులకి, కనీసం స్నేహమంటే ఏమిటో తెలియని బాల్యాన్ని కూడా ఈ జాడ్యం విడిచిపెట్టలేదు..
అసలు దినాలని కనిపెట్టిన మహాను భావులు కనపడితే చెప్పరూ. కాస్త ఆలోచించమని
...

No comments:

Post a Comment