Wednesday, August 5, 2009

అహో నా తెలుగు..

తెలుగు లోనే చదవాలనే తెలుగరీ..
నాపిచ్చి కానీ .. తెలుగు ఇష్టం ఎవరికో తెలుసా..
పరాయి దేశం లో ఉన్నా మన తెలుగోడికే.
"పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదన్నట్లు.. "
ఆంద్ర ప్రదేశ్ వాళ్ళకి తెలుగు సైట్లు కానీ, తెలుగు బ్లాగులు కాని చదవబుద్ది కాదేమో?
ఎందుకో మరి తెలియదాయె.. పొరుగు కూరే రుచిగా తలచె..
బెంగుళూరు కెళ్ళి తెలుగు బ్లాగు నడిపితే..చదువరులకి చాల బాగుంటుంది..
అదే తెలుగు దేశంలో ఉండి, నడిపే తెలుగు బ్లాగు కి తెగులు వచ్చునట..
నాకెందుకో ఒక చిన్న అనుమానం, వలని బతికిన చేపలు పట్టడానికి కాకుండా,
చచ్చిన చేపలు పట్టడానికేమోనని .(వలంటే నెట్ అన్నా మాట)
కొందరు తెలుగు దేశం లో ఉన్నా తెలుగు T.V. చానళ్ళ వాళ్ల కి తెలుగు సరిగా మాట్లాడ్డం రాని వాళ్ళే దొరుకు తారు.
దేశం మరి గొడ్డు పోయింది..
కనీసం తమ భావాలను తెలియచేసే వారు గానీ, చెప్పే వారు గాని సదరు తెలుగు గడ్డ మీద లేరేమో?
నా వరకూ. నే నాకొచ్చిన తెలుగుతో అందరిని ఇలాగే బాధిస్తుఉంటాను.
మేరె అలోచించి అవలోకించండి..

No comments:

Post a Comment